Esther Anil : 2014లో వెంకటేష్, మీనా కలిసి నటించిన చిత్రం దృశ్యం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్, మీనా చిన్న కూతురుగా ఎస్తెర్ అనిల్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తోంది. దృశ్యంలో నటించినప్పుడు ఆ చిన్నారికి 12 సంవత్సరాల వయసు. ఈ చిన్నది దృశ్యం 2లోనూ నటించి అందరి చూపులను ఆకర్షించింది.
ఇప్పుడు ఎస్తెర్ టీనేజ్ అమ్మాయిగా మారిపోయింది. చూడడానికి హీరోయిన్లను తలదన్నే బ్యూటీలా కనిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతులను పోగొడుతోంది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే పిక్స్ ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారిపోతున్నాయి.

కేవలం ఏడేళ్ల గ్యాప్ లోనే ఈ చిన్నది అందాల ముద్దుగుమ్మలా తయారయ్యి అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా పిచ్చ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ పెట్టే పోస్టులకు రోజు రోజుకూ అభిమానులు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నారు. తెలుగులో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. మన యంగ్ హీరోలకు సరైన జోడీగా కనిపిస్తోంది ఎస్తెర్ అనిల్. ఈమె ఇప్పటికే మళయాళంలో హీరోయిన్ గా బిజీ అయిపోయింది. ఎస్తెర్ ఎలాంటి ఫోటోలని పోస్ట్ చేసినా కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.