Eesha Rebba : ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పిట్ట కథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ఈషా రెబ్బ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అచ్చతెలుగు వరంగల్ అమ్మాయి ఈషా. చాలా చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఆదరణ తక్కువే అని చెప్పాలి. కానీ ఈషా రెబ్బ మాత్రం బాలీవుడ్ బ్యూటీస్ కు సరి సమానంగా తన గ్లామరస్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా హీరోయిన్ గా నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దానికి కారణం ఆమె టాలెంట్, అందం.
సాంప్రదాయక వస్త్రధారణ లో గాని, వెస్ట్రన్ వేర్ లో గాని తన గ్లామర్ తో చూసేవాళ్ళ మతులు పోగొట్టే విధంగా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ లను ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈషా. సినిమాల్లోకి రాకముందు ఈషా మోడలింగ్ చేసేది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈషా ఫోటోలను ఫేస్ బుక్ లో చూసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకు ముందు ఆ తరవాత సినిమాలో అవకాశం కల్పించారు.

ఈ చిత్రం తర్వాత అనేక సినిమా ఆఫర్లను అందుకుంది. నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. హీరోయిన్ అయినప్పటికీ ఎంతగా గుర్తింపు వచ్చిన ఈషా ఫోటోషూట్స్ మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. తన అందాల ఆరబోతకు హద్దులు లేవు అన్నట్లు బ్లాక్ అండ్ బ్లాక్ వేర్ లో చూసేవారి మతి పోగొట్టేస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్స్ తో ఈషా అందాన్ని పొగిడేస్తున్నారు.