Memory Power : మనం ఎప్పుడు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి విషయాల గురించి అయినా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత తగ్గుతుందో మెదడు పనితీరు మందగిస్తుంది. మెదడు పనితీరులో అవకతవకలు ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి ఏకాగ్రత అనేది నెమ్మదిగా తగ్గుతుంది. మనం చేయాలనుకున్న పనిలో కూడా ఏకాగ్రత లోపిస్తుంది.
అదేవిధంగా ఇష్టాలు, అయిష్టాలపైన కూడా ఏకాగ్రత అనేది ముడిపడి ఉంటుంది. మెదడు పనితీరు సక్రమంగా ఉండి ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ మూడు అంశాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు ఆ అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఏకాగ్రతలేని వ్యక్తికి ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఆవలింతలు ఎక్కువగా రావటానికి కారణం మన బ్రెయిన్ వెడేక్కినప్పుడు దాన్ని చల్లార్చడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి. మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి.
ప్రాణాయామం, వ్యాయామం, ఆసనాలు చేయడం వలన రక్తప్రసరణ శరీరంలో బాగా జరగటంతోపాటు మెదడు కణాలకు ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. నిత్యం ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అదేవిధంగా నిద్ర కూడా ఏకాగ్రతపై ప్రభావం చూపిస్తుంది. నిద్రకు, ఏకాగ్రతకు కూడా సంబంధం ఉంటుంది. నిద్ర సరిగా లేకపోతే మన మెదడు యాక్టివ్ గా ఉండదు.
మెదడు పని చేసినప్పుడు మెదడులోని కణజలమంతా కూడా వ్యర్ధాలను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే మెదడులో వ్యర్ధాలు ఎక్కువగా పేరుకుంటాయో మెదడు పనితీరు అనేది మందగిస్తుంది. మనం నిద్రపోతామో ఆ సమయంలో మెదడు కణాలు రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు, టెన్షన్స్ లేకుండా హాయిగా నిద్ర పోతామో మెదడులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. నిద్ర, వ్యాయామాలే కాకుండా తీసుకునే ఆహారం కూడా ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది.
ఉడికిన ఆహారాలు ఏకాగ్రత లోపించేలా చేస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఆహారం ఏకాగ్రతను పెంచే విధంగా ప్రేరేపిస్తాయి. నట్స్, సలాడ్స్, జ్యూస్ లు వంటి నాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలా ఫ్రెష్ ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ లో ఏకాగ్రత పెరిగి చేసే పనిని సక్రమంగా నిర్వహించగలరు. కొబ్బరి, వాల్ నట్స్, బాదం, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఏకాగ్రత అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…