Chaddannam : పెద్దల మాట చద్దన్నం మూట అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే పెద్దలు ఎప్పుడూ మన మంచిని కోరుకుంటారు అని ఈ సామెత అర్థం. ఇప్పుడు మారుతున్న జీవనశైలిని బట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అంటూ ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా అంటూ నాలుకకు రుచిగా అనిపించే పదార్థాలను తింటున్నాం. కానీ మన పూర్వకాలంలో పెద్దలకు బ్రేక్ ఫాస్ట్ అంటేనే తెలియదు. వాళ్లకు బ్రేక్ ఫాస్ట్ ఉదయాన్నే చద్దన్నం తినడం. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ చద్దన్నం ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అందుకే పూర్వం పెద్దవాళ్లు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దాదాపు వంద ఏళ్ళ వరకు జీవించేవారు. రాత్రి వండిన అన్నంలో పెరుగు వేసి బాగా కలిపి దానిలో ఒక ఉల్లిపాయ ముక్క వేసి ఉదయం వరకూ ఉంచితే దానినే చద్దన్నం అంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ చద్దన్నం తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మరి చద్దన్నం తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.
చద్దన్నం తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా అందుతుంది. కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఎప్పుడూ నీరసంగా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు చద్దన్నం తినడం వల్ల జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. పేగు సంబంధిత సమస్యలు, అల్సర్స్ తో బాధపడుతున్నవారికి చద్దన్నం పరమౌషధంగా పనిచేస్తుంది.
చద్దన్నంలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహకరిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల కడుపు నిండుగా అయిన భావన కలిగి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరానికి శక్తిని అందించి అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. కనుక రోజూ చద్దన్నాన్ని తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…