Cumin Water : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి జీలకర్రను వంటల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో నేరుగా వేస్తారు. లేదా వేయించి పొడిగా కూడా ఉపయోగిస్తారు. జీలకర్ర వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే జీలకర్ర నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటిని తప్పక తాగాలి. ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నడుము వద్ద ఉండే కొవ్వు పూర్తిగా కరిగి సన్నగా మారుతారు. దీంతోపాటు కిడ్నీ స్టోన్లు కూడా కరిగిపోతాయి. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి.
జీలకర్ర నీటిని తాగడం వల్ల మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ నుంచి విముక్తి లభిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. అయితే జీలకర్ర నీటిని ఒక కప్పు మోతాదులోనే తాగాలి. రెండు కప్పుల నీళ్లను పోసి అందులో ఒక టీస్పూన్ జీలకర్రను వేసి ఒక కప్పు నీళ్లు అయ్యే వరకు మరిగించాలి. తరువాత నీళ్లను వడకట్టి గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. తాగిన తరువాత 30 నిమిషాల పాటు ఏమీ తినరాదు. ఇలా రోజూ క్రమపద్ధతిలో తాగడం వల్ల పైన తెలిపిన లాభాలు అన్నింటినీ పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…