Jr NTR : ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆచార్య ఫ్లాప్ తర్వాత తారక్ కొరటాల శివ కాంబో మూవీ ఆలస్యమవుతోంది. దీంతో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భుజం నొప్పి సమస్యతో బాధ పడుతున్నారని సమాచారం. కొన్నిరోజుల క్రితం జరిగిన బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ హాజరైనప్పటికీ తారక్ ను ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోందని తెలుస్తోంది.
నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని తారక్ కు వైద్యులు సూచించారట. మరోవైపు కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పనులను ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా ఈ ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బరువు తగ్గాల్సి ఉందట. కొరటాల శివ తారక్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాతో తారక్ కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కూడా సినిమాలు చేయనున్నాడు.