Doctor Babu : సోషల్ మీడియా ఎప్పుడు ఎవర్ని ఎలా టాప్ ప్లేస్ కి తీసుకెళ్తుందో చెప్పలేం. టిక్ టాక్ వచ్చిన తర్వాత అందరి టాలెంట్ బయటపడుతూ ఉంది. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తమ టాలెంట్ ని బయటపెడుతూ ఫేమస్ అవుతున్నారు. అలా టిక్ టాక్, ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ తో ఫేమస్ అయిన అమ్మాయే శాంతి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బంగారం అక్కగా శాంతి ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసిందే. బంగారం ఒకటి చెప్పనా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ వీడియోని డీజేగా క్రియేట్ చేయడంతో ఎంతోమంది సెలబ్రేటీలు సైతం బంగారం చెప్పనా అంటూ రీల్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బంగారం చెప్పనా అంటూ బుల్లితెర నటి మంజుల పెద్ద ఎత్తున సందడి చేసింది. తెలుగు బుల్లితెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్. ఒకప్పుడు ఈ సీరియల్ స్టార్ హీరోల సినిమాలకు సైతం షాక్ ఇస్తూ.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. దీనికి కారణం వంటలక్క, డాక్టర్ బాబులు.

డాక్టర్ బాబుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న పరిటాల నిరుపమ్ తన భార్య మంజుల కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తాజాగా మంజుల తన భర్తతో కలిసి బంగారం చెప్పనా అంటూ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా నిరుపమ్ చుట్టూ మంజుల బంగారం ఒకటి చెప్పనా అంటూ చివరిలో ఛీ పోరా.. అనేసింది. తన చేష్టలకు విసుగు చెందిన డాక్టర్ బాబు ఏకంగా మంజుల పీక పిసకబోయి తన మెడ పట్టి బయటకు గెంటేశాడు. ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.