ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఆ భగవంతుని నామస్మరణలో ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి భావంతో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు.
కార్తీకమాసం అంటేనే ఒక పండుగ వాతావరణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెలలో ఎక్కువగా గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయి.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఎక్కువగా నిర్వహిస్తారు. అయితే కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు.. అనే విషయానికి వస్తే..
ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసానికి దామోదరుడు అధిపతిగా ఉంటాడు. కనుక ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి.
ఇక ఈ మాసంలో చాలామంది నెల మొత్తం దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి దీపాలను వెలిగించడమే కాకుండా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తారు.
ఇలా దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో విష్ణువుకి ఉసిరికాయలు అంటే ఎంతో ప్రీతికరం కనుక ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.