Suman : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో సక్సెస్ లతో స్టార్ హీరో అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సరి సమానంగా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను సొంత చేసుకున్నాడు. విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నాగార్జున. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంతో ఘన విజయం అందుకొని నాగార్జున హీరోగా స్థిరపడ్డారు. మణిరత్నం గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ శివ వంటి వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
శివ చిత్రంతో తెలుగు సినిమా స్థితిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నిన్నే పెళ్ళాడతా వంటి చిత్రంతో రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన నాగార్జున ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రాన్ని ప్రారంభించారు. రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించిన నాగార్జున అన్నమయ్య చిత్రాన్ని ఏ మేరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం అప్పట్లో సినీ జనాలు అందరిలో నెలకొంది.
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలతో భక్తుడిగా ప్రేక్షకులలో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నాగార్జున. అయితే అన్నమయ్య చిత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేశారనే చెప్పచ్చు. 1997లో రిలీజ్ అయిన అన్నమయ్య ఆంధ్రరాష్ట్రాన్ని భక్తి భావంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ కూడా చాలా అద్భుతమైన నటనను కనబరిచారు. అయితే ఈ పాత్రకు ముందుగా సుమన్ చేయాల్సింది కాదట.
అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాలమట్టుకు సన్నివేశాల్లో ఆయన కాళ్ళ మీద పడే సన్నివేశాలు ఉన్నాయి. దానివలన వెంకటేశ్వరస్వామి పాత్రకు గాను ఒక సీనియర్ స్టార్ హీరో అయితే బాగుంటుందని రాఘవేంద్ర రావు ముందుగా నటభూషణ శోభన్ బాబును సంప్రదించారట. కానీ ఆయన ఆ పాత్రను వదులుకోలేక రూ.50 లక్షలు పెద్ద మొత్తంలో అడగడంతో ఆయన్ని పక్కన పెట్టి, ఈ పాత్రకు గాను బాలకృష్ణను సంప్రదించారట.
ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రలలో కనిపిస్తే అభిమానులు సినిమాను ఎలా ఆదరిస్తారో అనే భయంతో దర్శకరత్న రాఘవేంద్రరావు వెనక్కి తగ్గారట. ఇక ఆ తర్వాత సుమన్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని భావించి సుమన్ ని పిలిపించి కథ వినిపించటం జరిగిందట. సుమన్ కి కథ నచ్చడంతో ఆ తర్వాత ఫోటో షూట్ కూడా నిర్వహించి సుమన్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించి ఆయనను ఫిక్స్ చేశారట రాఘవేంద్రరావు. అలా సుమన్ కూడా అన్నమయ్య చిత్రం సక్సెస్ అవ్వడంలో తనవంతు పాత్ర పోషించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…