Basha Movie : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగినవారిలో రజనీకాంత్ కూడా ఒకరు. దక్షణ భారతదేశంలో ఆయన్ని ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. రజినీకాంత్ డైలాగ్ డెలివరీ, నటనలో ఆయన ప్రత్యేకంగా చూపించే స్టైల్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లో ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాల్లో బాషా చిత్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి వేరే చెప్పనవసరం లేదు. బాషా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ అప్పట్లో ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది.
ఒక డాన్ గా ముంబైని గడగడలాడించిన వ్యక్తి ఆటో డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిచాంరు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజినీకాంత్ మరియు నగ్మా హీరో హీరోయిన్ లుగా నటించిన బాషా చిత్రాన్ని ముందుగా తమిళంలో చిత్రీకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవా ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి. తమిళ్ లో ఈ చిత్రం ఘనవిజయం అందుకోవడంతో తెలుగులో కూడా డబ్ చేయాలని నిర్మాతలు భావించారు.
సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసినప్పుడు అప్పట్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న టాప్ హీరోలు బాలకృష్ణ లేక చిరంజీవితో కానీ రీమేక్ చేయాలనీ అనుకున్నారు. నిర్మాతలు పలువురు స్టార్ ల కోసం ఈ చిత్రాన్ని దేవిశ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారు. మన హీరోలను ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాలకృష్ణ రీమేక్ సినిమాలు చేయడానికి దూరంగా ఉండేవారు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చిన బాలయ్య రిజెక్ట్ చేశారు. నిర్మాతలు చేసేదేమీ లేక తెలుగులో కూడా రజినీకాంత్ తోనే డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయాన్ని సాధించింది. బాషా చిత్రంతో రజనీకాంత్ కు తెలుగు ప్రేక్షకులలో మరింత ఆదరణ పెరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…