Chiranjeevi : చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం ఏదో తెలుసా..?

Chiranjeevi : తెలుగు చిత్రసీమలో బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండ చిత్రంతో సక్సెస్ ను అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. అఖండ చిత్రం సక్సెస్ కావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 107 పై అందరి దృష్టి పడింది. అఖండ సినిమాతో బాలకృష్ణ మార్కెట్ పెరిగినట్టే. క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గోపీచంద్ మలినేని తదుపరి సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

ఇలా బాలకృష్ణ కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒక చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇద్దరు భామల మధ్య నలుగుతున్న ముద్దుల బావగా బాలకృష్ణ ఈ చిత్రంలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1990లో యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శోభన మరియు నిరోషా హీరోయిన్స్ గా నటించారు. ఇరువురి బామల కౌగిలిలో అనే పాట ఇప్పటికీ మనం ఏదో చోట వింటూనే ఉంటాం. కెవి మహదేవన్ అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి.

Chiranjeevi

యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ కు ఈ చిత్రంతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేయగలరు అనే గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు అత్తగా శారద నటించారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో  ఆకట్టుకున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన ఈ చిత్రం అప్పట్లో ఒక స్టార్ హీరో ఇంట్లో కొన్ని సన్నివేశాలు తీయడం జరిగింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవికి తమిళనాడులోని వెలచేరి అనే గ్రామంలో హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ మరియు దాని పక్కనే రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉన్నాయి. ఈ సినిమాలో అత్త శారద‌ ఇంటి పక్కన బాలకృష్ణ ఒక పూరి గుడిసెలో ఉంటారు. ఆ పూరి గుడిసెను కూడా చిరంజీవి స్థలంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే కాకుండా పొలంలో జరిగే సన్నివేశాలకు బంధించిన స్థలం కూడా చిరంజీవిదే. అప్పట్లో ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు చిరంజీవి ఇంట్లో చిత్రీకరించడం జరిగింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM