Bigg Boss : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. తెలుగులో గత ఆదివారం సీజన్ 6 ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు.. ఆ అవకాశం కోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తారు. బిగ్‌బాస్ నుంచి పిలుపు వస్తే చాలు.. అప్పటి వరకు చేస్తున్న సీరియల్స్, షోలను వదులుకుని బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సిద్ధపడతారు. ఈ షో ద్వారా వచ్చే క్రేజ్ అలా ఉంటుంది మరి. ఇక పాపులారిటితో పాటు.. హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు పారితోషికం లభిస్తుంది.
బాగా ఫేమ్ ఉన్నవారికి వారానికి ఏకంగా లక్షల్లో కూడా రెమ్యూనరేషన్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో చివరి వరకు ఉండి టైటిల్ గెలిచేవారికి ఇప్పటి వరకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తూ వస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా అంతే మొత్తం ఉండనున్నట్లు సమాచారం. ఇక విన్నర్‌కి ప్రైజ్ మనీతో పాటు ప్రతి వారం రెమ్యూనరేషన్ లభిస్తుంది. అలాగే హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కి వారానికి చెల్లింపులు ఉంటాయి. ఇక కంటెస్టెంట్లకు ప్రతి వారం రూ.3 లక్షల నుంచి రూ.80 వేలకు తగ్గకుండా చెల్లింపులు ఉంటాయని సమాచారం. బాగా పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లకి వారానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునకు సీజన్ పూర్తి అయ్యే వరకు భారీ మొత్తం ఇస్తున్నారని సమాచారం. సీజన్ 6 కోసం నాగార్జునకు ఏకంగా రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించనున్నట్టు టాక్. గత సీజన్ వరకు నాగార్జునకు రూ.8 కోట్ల వరకు ఇచ్చేవారని సమాచారం. ఈ సీజన్‌కు నాగ్ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీ బిగ్‌బాస్ షో కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.350 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. కాకపోతే అక్కడ వచ్చే రేటింగ్స్ కూడా భారీగానే ఉంటాయి. హిందీ బిగ్‌బాస్ మరీ బోల్డ్‌గా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…