Allu Sneha Reddy : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్. 1983 ఏప్రిల్ 8న మద్రాస్ లో జన్మించిన అల్లు అర్జున్.. 18 సంవత్సరాల వరకు అక్కడే పెరిగాడు. చెన్నైలో బాగా ఫేమస్ అయిన పద్మ శేషాద్రి స్కూల్ లో విద్యాభ్యాసం చేశాడు. స్కూల్ రోజుల్లోనే బన్నీ చదువులో కాస్త పూర్. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకొని భవిష్యత్ కి బాటలు వేసుకున్నాడు. ఇప్పుడు బన్నీ ఇంతలా డాన్స్ చేయటానికి ఆ జిమ్నాస్టిక్స్ కారణం అని చెప్పవచ్చు. 10వ తరగతి వరకే చదివిన అల్లు అర్జున్ నటన, డాన్స్, ఫైట్స్ విషయంలో మాత్రం మాస్టర్ డిగ్రీ అందుకునట్టే.
ఇక బన్నీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2011లో స్నేహలత రెడ్డితో వివాహం అయింది. సోషల్‌మీడియాలో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్నేహ పెళ్ళికి ముందు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసింది. ఇండియా వచ్చాక తన తండ్రి స్థాపించిన కాలేజ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంది.
స్నేహ పెళ్ళయాక కూడా ఒక వైపు పిల్లలు అయాన్, అర్హలను చూసుకుంటూ మరో వైపు కాలేజ్ బాధ్యతలు, స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేలా జూబ్లీ హిల్స్ లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక ఫోటో స్టూడియోను కొనుగోలు చేసి తన టేస్ట్ కి తగ్గట్టుగా బేబీ ఫొటోగ్రఫీ, మెటర్నటీ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్స్ తో అద్భుతంగా రన్ చేస్తుంది. స్నేహ ఎంత పెద్ద చదువు చదివినా నిరాడంబరంగా ఉండటం ఆమె ప్రత్యేకత. అమెరికాలో చదివినా పక్కా హిందూ సంప్రదాయాలను ఫాలో అవుతూ.. భర్తను, అత్తమామలను గౌరవిస్తూ.. అచ్చ తెలుగు కోడలు పిల్లలా అందరినీ మెప్పిస్తుంది స్నేహ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…