Mega Heroes : మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో కానీ అభిమానుల్లో కానీ ఒకరకమైన గౌరవం, అభిమానం ఉంటాయి. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మన మెగా హీరోస్ కి మాత్రం కొందరిపై క్రష్ ఉందట, అంతేకాదు ఒక అడుగు ముందుకేసి రిలేషన్స్ లో కూడా ఉన్నారట. మన స్టార్ హీరోస్ కి ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం.
నాగబాబు కొడుకైన వరుణ్ కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. అయితే వరుణ్ రెండు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడని వార్త వైరల్ అవుతూనే ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లోని కలిసిన నటించారు. ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి అంటూ వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిపై ఇద్దరూ ఎప్పుడూ, ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఓ బర్త్‌డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మెగా మేనల్లుడు సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ కి కూడా అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సాయిధరమ్ తేజ్ కి రెజీనా కసాండ్రాతో ఎఫైర్ ఉంది అంటూ అనేక రోజులుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా రెజీనా కసాండ్రతో పిల్ల నువ్వు లేని జీవితం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం సినిమాలు వచ్చాయి. ఇలా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాలు రాగా ఈ వార్తలకు బలం చేకూరింది. అలాగే కొన్నాళ్లపాటు వీరిద్దరూ బ్రేకప్ అయినా మళ్లీ కలిసే ఉంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు అల్లు శిరీష్ కూడా ఎప్పుడూ ఎఫైర్స్ తో వార్తల్లో ఉంటుంటాడు. అను ఇమ్మానుయేల్ తో ప్రేమ కాదంటా అనే సినిమాలో కలిసి నటించగా ఈ వార్తలకు ఈ సినిమాతోనే ఆరంభం అయింది. వీరిద్దరూ కలిసి ఎఫైర్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలీదు కానీ ఇలా మెగా హీరోస్ చుట్టూ ఎప్పుడూ హీరోయిన్స్ తో వార్తలు అల్లేసుకోవడం కామన్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…