Viral Photo : సౌత్‌లో సినిమా స్టార్స్‌ను బాగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. కొందరు స్టార్స్‌కు గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో.. సినిమా సెలబ్రిటీలు అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్‌తోపాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటున్నారు.
అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సాయి పల్లవి, పూజా హెగ్డె, కీర్తి సురేష్, రష్మిక మందన్న ఇలా చాలామంది హీరోయిన్స్ చైల్డ్‌హుడ్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. తాజాగా ఇదే కోవలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఈమె టాలీవుడ్, కోలివుడ్‌లలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్.. తెలుగులో యంగ్ హీరోలతో కూడా ఆడిపాడింది. మూవీస్ మాత్రమే కాదు.. ఫార్ములా వన్ రేసింగ్‌లో తన మార్క్ చూపిస్తోంది. ఇంకా గుర్తుకు రాలేదా.. ఆ ఫోటోలో ఉన్నది నివేతా పేతురాజ్. మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నివేదా. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురం, రెడ్ అలాగే ఇటీవల విడుదలైన విరాట పర్వంలో కూడా నివేతా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం నివేతా చిన్నప్పటి ఫోటో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోపై స్పందిస్తూ చిన్నప్పుడు నివేతా పేతురాజ్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…