Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి బాహుబలి సినిమాతో మన ఖ్యాతిని ఎల్లలు దాటించాడు. బాహుబలి ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలను సూపర్ డూపర్ హిట్స్‌గా మార్చి ప్రేక్షకులకి సరికొత్త వినోదం పంచాడు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. రాజమౌళి.. బాహుబలి, బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రిప్ట్‌లు రాసిన ప్రముఖ దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ కుమారుడు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి సంచలనాలు సృష్టిస్తున్నారు.
రాజమౌళిని చాలా మంది ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఆయనకు ఈ పేరు జూనియర్ ఎన్టీఆర్ పెట్టిందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఆ పేరు పెట్టింది అతను కాదు, రాజీవ్ కనకాల. జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1. 2001లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో గజాలా హీరోయిన్‌గా నటించింది. రాజీవ్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి వర్కింగ్ స్టైల్‌కు ముగ్ధుడై అతనికి జక్కన్న అని పేరు పెట్టాడు రాజీవ్.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అందించినప్పటికీ రాజమౌళి కన్నడలో నిష్ణాతుడు. ఈ భాషని అనర్గళంగా మాట్లాడగలడు. ఇక రాజమౌళి తన కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేదు. బాక్సాఫీస్‌ని షేక్ చేయకముందు రాజమౌళి పలు సీరియల్స్‌కి దర్శకత్వం కూడా వహించాడు. ఇక బాహుబలి కోసం ఆయన కుటుంబం అంతా పని చేశారు. తండ్రి కథ అందించగా, భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. అన్న కీరవాణి సంగీతం అందించాడు. కొడుకు ప్రొడక్షన్ పనులు చూసుకున్నాడు.
తాజాగా ఎన్టీఆర్‌తో జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ హిట్ కొట్టారు. రాజమౌళి ఇప్పటికే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. తెలుగు సినిమాలు తీస్తున్నప్పటికీ ఆయనకు కన్నడతో ప్రత్యేక అనుబంధం ఉంది. కన్నడ భాషను కూడా జక్కన్న బాగా మాట్లాడగలడు.
రాజమౌళి తన ఏ సినిమా హిట్ అవ్వాలని కూడా ఇప్పటివరకు ఏ గుడికో, మసీదుకో, దర్గాకో వెళ్లలేదు. ఎందుకంటే ఆయన దేవుడ్ని నమ్మడు. కానీ దేవుడు ఉన్నాడని నమ్మేవారిని మాత్రం గౌరవిస్తాడు.
దర్శకుడు శంకర్ అత్యంత విజయవంతమైన దర్శకుడు. కానీ ఆయన తీసిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే రాజమౌళి మాత్రం ఓటమిని ఎరుగని దర్శకుడు. ఆయన తీసిన సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. స్టూడెంట్ నంబర్ 1, మర్యాద రామన్న, ఈగ, ఛత్రపతి, బాహుబలి వంటి హిట్ సినిమాలు తీశారు. దీంతో రాజమౌళి టాలీవుడ్‌లో దర్శక ధీరుడిగా మారారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…