Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ రెండు సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేశాయి. దీంతో ఈ మూవీల రికార్డులను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేకపోయింది. అంతలా ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. అయితే బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం కాలకేయులతో యుద్ధం చేసినప్పుడు త్రిశూల వ్యూహాన్ని అనుసరిస్తారు కదా. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిశూల వ్యూహం అనేది మహాభారతంలో చెప్పబడిన 12 యుద్ధ వ్యూహాల్లో ఒకటి. చక్ర వ్యూహం, పద్మవ్యూహం వంటి వ్యూహాల్లో.. త్రిశూల వ్యూహం కూడా ఒకటి. దీన్ని సరిగ్గా ఉపయోగించాలే కానీ.. శత్రు రాజ్యం ఎంత పెద్ద భారీ సైన్యం ఉన్నా సులభంగా విజయం సాధించవచ్చు. కనుకనే మాహిష్మతి రాజ్యం ఈ వ్యూహాన్ని అనుసరించింది. యుద్ధంలో విజయం సాధించింది. పైగా కాలకేయులకు అంత బుద్ధి జ్ఞానం లేదు. వారు ఇలాంటి వ్యూహాలను అర్థం చేసుకోలేరు. తాము యుద్ధంలో దిగాం కాబట్టి.. శత్రువులను చంపడమనే ఒక్క పనే వారికి తెలుసు. కనుక బాహుబలికి, భళ్లాల దేవుడికి కాలకేయులతో యుద్ధం గెలవడం సులభతరం అయింది. వారు వ్యూహాలను అర్థం చేసుకోలేరు. అవి తెలియవు కూడా.
ఇక త్రిశూల వ్యూహాన్ని మాహిష్మతి రాజ్యం ఎంపిక చేసుకునేందుకు బలమైన కారణమే ఉంది. అదేమిటంటే.. మాహిష్మతి రాజ్యంలోకి ప్రవేశించేందుకు ఒక్కటే మార్గం ఉంటుంది. అది కూడా ఇరుకైన మార్గం. చుట్టూ కొండలు, నదులు ఉంటాయి. కనుక ఆ ఇరుకైన దారి నుంచే రాజ్యంలోకి రావాలి. దాన్ని కాపాడుకుంటే చాలు.. శత్రువులతో యుద్ధం గెలవచ్చు. అందుకు త్రిశూల వ్యూహం సరిగ్గా ఉపయోగపడుతుంది. కనుకనే మాహిష్మతి రాజ్యం ఆ వ్యూహాన్ని ఎంపిక చేసుకుంది.
త్రిశూల వ్యూహంలో భాగంగా తిరగేసిన వి (V) ఆకారంలో రాజ్యం దారిని ఒక సైన్యం రక్షిస్తుండాలి. అదే సమయంలో దానికి కుడి, ఎడమ వైపుల నుంచి మరో రెండు సైన్యాలు వేర్వేరుగా దూరం నుంచి వెళ్లి తిరిగి శత్రు రాజు వద్ద కలుసుకోవాలి. అప్పుడు రెండు వైపుల నుంచి శత్రు రాజును ముట్టడిస్తారు. దీంతో ఆ రాజుకు ఏం జరిగేదీ తెలియదు. ఇరు వైపుల నుంచి వచ్చిన సైన్యాలతో యుద్ధం చేయలేక రాజు ఓడిపోతాడు. దీంతో యుద్ధంలో సులభంగా గెలవచ్చు. ఇలా మాహిష్మతి వారు సులభంగా త్రిశూల వ్యూహాన్ని అమలు చేశారు. యుద్ధంలో విజయం సాధించారు. కనుకనే భారీ సైన్యం ఉన్నప్పటికీ కాలకేయులు ఓడిపోయారు.
అయితే త్రిశూల వ్యూహంలో మూడ సైన్యాలు పకడ్బందీగా యుద్ధం చేయాలి. ద్వారం వద్ద రక్షణగా ఉండే సైన్యానికి కాపలా ఉండే సైన్యాధికారి చాలా దృఢంగా ఉండి శత్రువులను ఎదుర్కోవాలి. అలాగే కుడి, ఎడమల వైపు నుంచి శత్రు రాజు వద్దకు వెళ్లే సైన్యాలు, వాటి సైన్యాధికారులు కూడా చాలా యోధులు అయి ఉండాలి. అప్పుడే యుద్ధంలో విజయం సాధిస్తారు. ఇక బాహుబలిలో ఈ పనిని ఆ ముగ్గురూ విజయవంతంగా నిర్వహించారు. కట్టప్ప ప్రధాన ద్వారం వద్ద సైన్యంతో శత్రువులను అడ్డుకోగా.. కుడి, ఎడమల నుంచి బాహుబలి, భళ్లాలదేవలు కాలకేయ రాజు వైపుకు ధైర్యంగా వెళ్లి వారితో భీకరంగా యుద్ధం చేసి గెలిచారు. చివరకు కాలకేయ రాజును చేరుకుని అతన్ని తుదముట్టించారు. ఇలా వారు అత్యంత బలమైనప్పటికీ కాలకేయుల సైన్యంతో పోరాడి విజయం సాధించారు. వారు త్రిశూల వ్యూహాన్ని సరిగ్గా అమలు చేశారు కనుకనే.. యుద్ధంలో గెలుపొందారు. లేదంటే ఈ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. కానీ కట్టప్ప, బాహుబలి, భళ్లాల దేవ అందులో చాకచక్యంగా వ్యవహరించారు. కాబట్టి విజయం వారి సొంతమైంది. ఇలా త్రిశూల వ్యూహాన్ని యుద్ధాల్లో అమలు చేస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…