Ram Charan : మెగా పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈ మధ్యే రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశ పరిచింది. అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం భారీ విజయం సాధించింది. దీంతో చరణ్ ఆచార్య ఫెయిల్యూర్‌ను పక్కనపెట్టి తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అయితే ఇటీవలే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెకేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉపాసన ధరించిన ఓ డ్రెస్ ఖరీదు రూ.2 లక్షలని తెలియగా.. ప్రస్తుతం రామ్ చరణ్ ఓ స్టైలిష్ డెనిమ్ జాకెట్‌తో కనిపించి అలరించాడు. ఆయన ఎయిర్ పోర్టులో ఉన్నప్పుడు ఫొటో తీయగా.. అందులో ఆయన ధరించిన డెనిమ్ జాకెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే దాని ధర కోసం ఆన్‌లైన్‌లో కొందరు వెతికి చూశారు. దాని ధర తెలిసి షాకయ్యారు. రామ్ చరణ్ ధరించిన డెనిమ్ జాకెట్ ఖరీదు అక్షరాలా రూ.2 లక్షలు ఉంటుందని తెలిసి అవాక్కవుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్‌కు చెందిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీకి అధికారి అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా.. దీన్ని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…