Pavitra Lokesh : ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో అనేక జంటలకు సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే నటుడు నరేష్ పై వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. నరేష్.. పవిత్ర లోకేష్‌తో ప్రేమలో ఉన్నారని.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఆ వార్తలు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలను నరేష్ ఖండించారు. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశారు. కానీ తీరా చూస్తూ ఇద్దరూ ఒక స్వామీజీ వద్ద పూజలు మాత్రం చేశారు. పలు ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. దీంతో నరేష్ కొట్టి పారేసినప్పటికీ వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. కాకపోతే ఆ విషయాన్ని ఇప్పటికప్పుడు చెప్పడం ఇష్టం లేదని.. అందుకనే ఆయన ఆ వార్తలను ఖండించారని మళ్లీ ప్రచారం జరుగుతోంది.
నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ కలసి కపిస్తున్నారు. వీరిద్దరూ కలసి 10కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు.. నరేష్ ఆమెను తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేశారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే పవిత్ర లోకేష్ తన భర్తకు ఇంకా విడాకులు ఇవ్వలేదని.. కనుకనే వీరి వివాహం ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు వీరిద్దరి వయస్సుకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. వీరి వయస్సు ఎంత.. ఇద్దరిలో ఎవరు పెద్ద.. ఎవరు చిన్న.. వీరి ఏజ్ గ్యాప్ ఎంత.. అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా నరేష్ వయస్సు 62 ఏళ్లు. అలాగే పవిత్ర లోకేష్ వయస్సు 43 సంవత్సరాలు. ఈ ఇద్దరికీ ఏజ్ గ్యాప్ 19 ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఎప్పుడు.. అనే వార్తలు సోషల్ మీడియాలో రోజూ హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరు త్వరలో తీపి కబురు చెబుతారా.. లేక ఆ వార్తలను పుకార్లుగానే ఉంచుతారా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.