Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది వర్ధమాన నటులకు అవకాశం దక్కింది. జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ షో కమెడియన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారు చేసే స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది. సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. కొంతకాలంగా హైపర్ ఆది టీం లీడర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్ షోతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది తన స్కిట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇప్పుడు హైపర్ ఆది మీద ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలలో పాల్గొని మల్లెమాల సంస్థ నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆది జబర్దస్త్ లోకి రాకముందు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడట. ఆది బీటెక్ చదువుకునే టైంలో రూ.20 లక్షల వరకు అప్పు చేశాడని ఒక ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసుకున్నాడు.
అప్పులు తీర్చడానికి నాన్న మూడు ఎకరాల పొలం అమ్మేశాడు అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా రెండు చేతులతో లక్షల రూపాయలను సంపాదిస్తూ కోట్ల ఆదాయాన్ని వెనకేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆది తన సొంత ఊరిలో 16 ఎకరాల పొలం, హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లు కొన్నాడని వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. దీంతో ఆది రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే సుడిగాలి సుధీర్, ఆది వంటి వారు అందరూ నెల నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాదికి ఆది సుమారుగా రూ.1 కోటికి పైగానే సంపాదిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…