Actress : సినిమాల్లో హీరోయిన్లను చూడంగానే ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడే భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యల లాగా కనిపిస్తారు. సినిమాల్లో హీరోయిన్లు కొంతమంది మేకప్ వేసి అందంగా కనిపిస్తే కొంతమంది మాత్రం సహజంగానే అందంగా ఉంటారు. హీరోయిన్లు ఇంత అందంగా ఎలా పుట్టారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ల అందం వెనుక కోట్లు ఖర్చుపెట్టి చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు ఎన్నో ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ సర్జరీలతో తమ అందాన్ని రెట్టింపు చేసుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.
ఏం మాయ చేశావే సినిమా చూస్తుంటే.. అచ్చం పక్కింటి అమ్మాయిలాగా కనిపించేది సమంత. కాస్త స్టార్ హీరోయిన్ గా కాగానే సమంత లుక్కు మొత్తం మారిపోయింది. ఇంత మార్పు రావడానికి సామ్ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ కోసం సమంత ఏకంగా రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. శ్రీదేవిని చూడగానే అతిలోక సుందరిని చూస్తున్నట్టు ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు. శ్రీదేవి ముక్కు సర్జరీ కోసం ఆ రోజుల్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టిందట.

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష సైతం ముక్కు సర్జరీ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రియాని చూస్తుంటే అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. పెళ్లయి పిల్లలు పుట్టినా చెక్కుచెదరని అందం ఈ అమ్మడి సొంతం. కానీ శ్రియ కూడా తన పెదాల సర్జరీ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఆసిన్ సైతం లిప్ సర్జరీ కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందట.
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార లైపోసెక్షన్ తోపాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. ఇక దీని కోసం నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగు ప్రేక్షకుల జేజమ్మ లావు తగ్గడానికి లైపోసక్షన్ చేయించుకుందట. ఈ విషయంపై స్వీటీ ఎప్పుడూ స్పందించలేదు కానీ సర్జరీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తున్న తాప్సీ తన ముక్కు సర్జరీ కోసం రూ.1.5 కోట్ల వరకు ఖర్చు పెట్టిందట. టాలీవుడ్ చందమామగా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ ముక్కు సర్జరీ కోసం రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న కార్తీక ముక్కు సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం.