Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె ప్రస్తుతం పలు వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంది గతేడాది ఈమె నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ అమ్మడికి ఒక్కో మూవీ షాక్‌ను ఇస్తోంది. మొదట రాధేశ్యామ్, తరువాత బీస్ట్, ఇటీవల ఆచార్య మూవీలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. వీటిల్లో బీస్ట్ కాస్త ఫర్వాలేదనుకున్నా.. రాధేశ్యామ్, ఆచార్య మాత్రం బాగా నిరాశ పరిచాయి. దీంతో పూజా హెగ్డెకు మళ్లీ ఐరన్ లెగ్ అన్న ముద్ర తిరిగి వచ్చేసింది. అయితే ఈమెకు ఇప్పటికప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకున్నా.. ఈమె ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అవి హిట్ అవ్వాలని కోరుకుంటోంది. లేదంటే పూజాకు మళ్లీ కెరీర్ ప్రారంభ రోజులు వస్తాయని అంటున్నారు.
అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగు, హిందీలో పలు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వాటిల్లో పూరీ జగన్నాథ్ జేజీఎం (జనగణమణ) ఒకటి. దీనికి గాను ఈ అమ్మడు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటోందట. అదే జరిగితే తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లు ఎవరూ లేరు. దీంతో పూజా హెగ్డె పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రూ.5 కోట్లలో రూ.4 కోట్లు తన రెమ్యునరేషన్ కాగా.. రూ.1 కోటి తన స్టాఫ్ శాలరీలు, ఇతర ఖర్చులకు వసూలు చేస్తోంది.
ఇక ఇదే కాకుండా ఈమె త్వరలోనే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీలో చేయనుంది. అలాగే హిందీలోనూ రెండు ప్రాజెక్ట్స్‌కు ఓకే చేసింది. దీంతోపాటు పవన్‌తోనూ ఓ మూవీ చేయనుంది. అయితే దీని గురించి మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. పూజా హెగ్డె రెమ్యునరేషన్ పెరగడం మాత్రం విశేషమనే చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…