Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించి ప్రజల కష్టాలను, కన్నీళ్లను తెలుసుకున్న జనసేనాని వారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అక్టోబర్ నుంచి ఈయన బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఆయన కాన్వాయ్‌లో కొత్త వాహనాలను కూడా ఇప్పటికే కొనుగోలు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది.
దర్శకుడు క్రిష్‌తో వచ్చిన విభేదాల కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కానీ నిర్మాత ఏఎం రత్నం ఇద్దరికీ కలసి నచ్చజెప్పడంతో ఎట్టకేలకు దర్శకుడు క్రిష్ చిత్రంలో మార్పులు చేసేందుకు అంగీకరించారట. దీంతో మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం 3వ పెళ్లి చేసుకుని రష్యాకు చెందిన అన్నా లెజినివాతో కలసి ఉంటున్న విషయం విదితమే. అంతకు ముందు ఆయన రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు.

రేణు కన్నా ముందు పవన్ విశాఖపట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ సినిమాల్లోకి రాకముందే ఈ వివాహం జరిగింది. అప్పట్లో చిరంజీవి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పవన్ పెళ్లిని చేయించారు. అయితే బద్రి సినిమాతో రేణుదేశాయ్‌కి పవన్‌కు మధ్య సహజీవన సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు కొన్నేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. అయితే చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని పెట్టిన సమయంలో విమర్శలు రావడంతో పవన్ తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి అనంతరం రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు.
ఇక రేణును పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు సంతానం కలిగారు. అకీరా నందన్, ఆద్య జన్మించారు. కాగా మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన సమయంలో పవన్ ఆమెకు రూ.30 లక్షల భరణం ఇచ్చారు. తరువాత ఆమె వైజాగ్‌కు చెందిన ఓ డాక్టర్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయింది. అయితే పవన్ ఆమె నుంచి ఎలాంటి కట్నం లేకుండానే వివాహం చేసుకున్నారట. ఈ వివాహాన్ని కూడా చిరంజీవి సెట్ చేశారట. కానీ పవన్ నందినితోపాటు రేణు దేశాయ్‌కి కూడా విడాకులు ఇచ్చారు. ఇప్పుడు 3వ భార్య అన్నా లెజినివాతో నివాసం ఉంటున్నారు. కాగా పవన్ హరిహర వీరమల్లుతోపాటు వినోదయ సీతమ్ రీమేక్‌లోనూ యాక్ట్ చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను 2 నెలల్లోనే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.