NTR : ఎన్టీఆర్‌ తన తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!

NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాల న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు రావ‌డం ఖాయం. అయితే నవంబర్ 16తో తారక్ నటుడిగా ఎంట్రీ ఇచ్చి 21 సంత్సరాలు పూర్తయింది.

మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ గురించిన వార్తలే వస్తున్నాయి. తారక్ సినిమాల గురించి.. అతని గురించి తెలియని ఇంపార్టెంట్ విషయాల గురించే పెద్ద ఎ్తతున వార్తలు వైరల్ అవుతున్నాయి.

1997లో బాల రామాయణం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు జూనియర్. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి అవార్డులతోపాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం అప్పట్లో రూ.4 లక్షలు తీసుకున్నాడు ఎన్టీఆర్. కేవలం 17 ఏళ్ల వయసులో ఈయనకు వచ్చిన రెమ్యునరేషన్ తీసుకుని సీదా ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ రెమ్యున‌రేష‌న్ తీసుకెళ్లి త‌న తల్లికి ఇచ్చాడు ఎన్టీఆర్. తొలి సినిమా తర్వాత రెండేళ్లలోనే స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన ఒక్కో సినిమాకు కనీసం రూ.30 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌’లో తారక్‌ కొమురం భీమ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అనంతరం ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM