Nithiin : తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నితిన్ ఫస్ట్ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో ఫ్లాప్స్ ని ఎదుర్కొన్నా.. ఇష్క్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో నితిన్ క్రేజీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా భీష్మ, రంగ్ దే, మాస్ట్రో సినిమాలతో హిట్ సాధించి వరుస సినిమాలపై ఫోకస్ చేశాడు. అలాంటి నితిన్ పర్సనల్ విశేషాలపై ఓ లుక్కేద్దాం.
నితిన్ అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు హీరో నితిన్. ఆయనకు నిఖితారెడ్డి సోదరి ఉంది. హైదరాబాద్ రత్న కాలేజ్ లో ఇంటర్మీడియట్, గండిపేటలో షాదాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రొడ్యూసర్ గా గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతోపాటు చినదాన నీకోసం సినిమాల్ని రూపొందించారు. నితిన్.. శాలినీని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన భీష్మ సూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఈ సమయంలో ఆ మూవీ డైరెక్టర్ కి రేంజ్ రోవర్ కారుని నితిన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్ రూ.6 కోట్ల నుండి రూ.7 కోట్ల వరకు తీసుకుంటాడట. నితిన్ కు కార్లంటే చాలా ఇష్టం. అందుకే జాగ్వర్ ఎస్ఎఫ్, బీఎంయూయూ ఎక్స్ 5 కార్ లను సొంతం చేసుకున్నాడు.
అలాగే 1కోటి 20 లక్షలు ఖరీదు చేసే పోర్షే కయెన్, హోండా సీఆర్వీ, ఇన్నోవా క్రిస్టా లాంటి కార్లు నితిన్ దగ్గర ఉన్నాయి. 2013వ సంవత్సరంలో ఓ సొంత ప్రొడక్షన్ స్టూడియోని కూడా నిర్మించాడు. ప్రస్తుతం నితిన్ హీరోగా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…