RGV Missing : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్స్ క్రియేట్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజగా ఆయన ఆర్జీవీ మిస్సింగ్ చిత్రంతో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. అప్పుడెప్పుడో ఈ సినిమాని తెరపైకి తీసుకురాగా, మధ్యలో కొన్నాళ్లు పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసి తిరిగి వార్తలలోకి ఎక్కారు. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు కిడ్నాప్ చేశారనే కోణంలో ఈ సినిమాను తీసినట్లు.. ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో పలువురు టాలీవుడ్ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. వర్మ క్రియేట్ చేసిన ‘ఆర్జీవీ మిస్సింగ్’ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.
ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది.
ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలను తెలుసుకుంటారు. ఈ విధంగా కథ సాగుతుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…