Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన నటులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు నటన మీద మక్కువతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని తాము అనుకున్నది సాధించి చివరకు ఇండస్ట్రీలో అగ్రహీరోలలాగా, సినీ పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచారు. సినిమా ఇండస్ట్రీ మొదట్లో ఈ గొప్ప నటులు చేసిన కృషి ఎంతోమందికి దారి చూపింది. ఇదే కోవకు చెందినవారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎన్నో కష్టాలను ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగారు.
1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆయనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్ర స్థాయి హీరోగా పేరు పొందారు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవిని మనం ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటాం. ఎప్పుడైనా మెగాస్టార్ అన్న బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకున్నారా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అగ్రస్థాయి హీరోలుగా ఉన్న సమయంలోనే చిరంజీవి హీరోగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత అయిన కేఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి ఎన్నో చిత్రాల్లో నటించి విజయం సాధించారు.
అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ అందుకున్నారు. ఆ టైం లో కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరణ మృదంగం చిత్రంలో మొదటి సారిగా చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పెట్టారు. ఆ తరవాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
మరలా తిరిగి ఇదే బ్యానర్ పై దాదాపు 20 సంవత్సరాల తర్వాత భోలా శంకర్ చిత్రంతో రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో అజిత్ హీరోగా నటించి విజయం సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ భోలా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రఘు బాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, రష్మీ గౌతమ్, శ్రీముఖి వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…