Ram Charan : మెగాస్టార్ చిరంజీవి సినీ వారసుడిగా రామ్ చరణ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. చిరుత చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రంతో ఘన విజయం సాధించి నటన పరంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మగధీర విజయంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ధృవ, ఎవడు, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. హాలీవుడ్ డైరెక్టర్ లు సైతం చరణ్ తో సినిమాలు చేయాలనే కోరికను కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో Rc15 చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఇక చిత్రాలలోనే కాదు నిజజీవితంలో కూడా రామ్ చరణ్ ఒక సక్సెస్‌ఫుల్ వ్యక్తి అని చెప్పవచ్చు. చాలా మంది నటులు తమ దగ్గర పనిచేసే స్టాఫ్ ని సొంత వారిలా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా తమకు తోచిన సాయం చేస్తూ వారి దగ్గర పనిచేసే ఉద్యోగులకు అండగా నిలుస్తారు. ఇలా తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు సాయం చేసే స్వభావంలో చరణ్ ముందు ఉంటారు.
చిరంజీవి కూడా కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటికి కూడా ఒకే మేకప్ మ్యాన్ ని తన దగ్గర ఉద్యోగంలో కొనసాగింపు చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన తన బాడీగార్డ్ కి ఆర్థిక సహాయం అందించి తన ఉదార స్వభావం చాటుకుని అందరి మనసులను గెలుచుకున్నారు. అలా ఉంటుంది మెగాస్టార్ ఫ్యామిలీతో స్టాఫ్ కి అనుబంధం.
ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కు నెలకు 45 వేల రూపాయిలు జీతం ఇస్తారని సమాచారం వినిపిస్తోంది. అయితే కొత్తగా జాయిన్ అయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీతం కన్నా రామ్ చరణ్ దగ్గర పనిచేసే డ్రైవర్ జీతమే ఎక్కువ అని ఆశ్చర్యపోతూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…