Ram Charan : స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఆర్‌సీ 15పేరిట షూటింగ్ కూడా స్టార్ట్ కావడం ఒక షెడ్యూల్ పూర్తవ్వడం జరిగాయి. ఇదే సమయంలో ఆర్‌సీ16 పేరిట మరో సినిమాను కూడా చెర్రీ చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన భారీ మొత్తంలో ఇప్పటికే రెమ్యునరేషన్ అందుకుంటుండగా.. ఇప్పుడు దాన్ని రెండు రెట్లు పెంచాడని తెలుస్తోంది.
మాములుగా అయితే 50 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుండగా చరణ్ తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. రూ.100 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి గాను చరణ్ రూ.50 కోట్లు తీసుకున్నాడట. ఈ క్రమంలోనే శంకర్ సినిమాకు ఆయన రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం శంకర్‌తో చేస్తున్న సినిమాకు బ్రేక్ పడింది. కారణం.. శంకర్ ఇండియన్ 2ను తీస్తుండడమే. దీనికి మొన్నీ మధ్య వరకు కోర్టు చిక్కులు వచ్చాయి. ప్రస్తుతం అవి తొలగిపోయాయి. దీంతో ఇండియన్ 2 షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారు. కనుక ఆ షూటింగ్ అయ్యే వరకు చరణ్ ఓపిక పట్టాల్సిందే.