Prabhas : ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకి సుపరిచితం. బాహుబలి సినిమాతో తన రేంజ్‌ని పెంచుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలలో ఓ రెండు మంచి హిట్ సాధించాయంటే ప్రభాస్‌ని అందుకోవడం ఎవరి వలనా కాదు.
ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఈ హీరో తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలామంది అనుకుంటారు. కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. కాకపోతే అది గెస్ట్ రోల్ మాత్రమే. ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోగా మంచి పేరు పొందాడు. ఇక ఈయన కటౌట్ కి సౌత్ ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది.
ప్రభాస్ ఫిజిక్ వెనక ఉన్న వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి. ప్రభాస్ ట్రయినర్ ఇతడే. 2010లో లాస్ వెగాస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేత ఇతడు. రీసెంట్ గా ఇతడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్. అయితే తన గ్రాడ్యుయేషన్ శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ లో పూర్తి చేసిన ప్రభాస్ 2002వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఈశ్వర్ సినిమాతో యావరేజ్ గా సరిపెట్టుకున్నాడు ప్రభాస్.
ప్రభాస్ కెరియర్ సాఫీగా సాగుతోంది. పర్సనల్ లైఫ్ మాత్రం కాస్త వెలితిగా కనిపిస్తోంది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అభిమానులకి ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పుడు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా పేరొందిన ప్రభాస్ 215 కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టినట్టు సమాచారం. ఇందులో కొంత చారిటీకి ఇస్తుంటాడట. ప్రభాస్‌కి హైదరాబాద్‌లో రూ.62 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆయన దగ్గర 8 ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…