T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ అని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్ ఎల్లప్పుడూ పైచేయి సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కనుక ఈ మ్యాచ్‌లోనూ గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారు ఆశలు అడియాశలు అయ్యాయి. భారత్‌ను పాక్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్‌ను నిలువరించడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలం అయ్యారు. పాక్ ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే అటాక్ ప్రారంభించారు. దాన్ని చివరి వరకు కొనసాగించారు. దీంతో భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించారు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓటమి పాలు కావడంతో మన ఇజ్జత్ మొత్తం పోయిందనే చెప్పవచ్చు.
ముందు నుంచీ పాక్ ప్లేయర్లు ఎంతో ధీమాగా ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది భారత జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. తరువాత మిడిలార్డర్ అయినా ఆదుకుంటుందనుకుంటే.. వారు కూడా విఫలం అయ్యాడు. దీంతో కెప్టెన్ కోహ్లి, వికెట్ కీపర్ పంత్‌లు కొంతసేపు క్రీజులో నిలబడి ఆ మాత్రం స్కోరున అయినా భారత్‌కు అందించగలిగారు. లేదంటే భారత్ కు ఇంకా దారుణమైన పరాజయం వచ్చి ఉండేది. ఏది ఏమైనా.. ఈ మ్యాచ్ అనంతరం భారత అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…