Janhvi Kapoor : బాలీవుడ్ క్రేజీ బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన నటనతో, అందంతో కుర్ర కారు హృదయాలను దోచుకుంటుందని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అందంగా ఉంటుంది. అయినప్పటికీ రోజువారీ చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటుంది. ముఖం, చర్మంతోపాటు శరీర సౌందర్యానికి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది జాన్వీ కపూర్. బయట దొరికే వివిధ కంపెనీల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడానికి బదులుగా, ఇంట్లోనే చర్మ సంరక్షణకు కావల్సిన వాటిని తయారు చేసి, వాటినే వాడడానికి జాన్వీ కపూర్ ఇష్టపడుతుందని సమాచారం.

జాన్వీ కపూర్ తన చర్మ సంరక్షణకు అనేక జాగ్రత్తలను తీసుకుంటుంది. సాధారణంగా సినీ బ్యూటీస్ ఎక్కువగా మేకప్ ను వేసుకుంటూ ఉంటారు. కానీ జాన్వీ మాత్రం మేకప్ లేకుండానే మెరిసి పోతూ ఉంటుంది. జాన్వీ కపూర్ నటిగా తెరంగేట్రం చేసిన నాటి నుండే తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తను సహజంగానే అందంగా కనిపించడానికి ప్రత్యేకమైన పేస్ ఫ్యాక్ ను వాడుతుంది.
ఈ పేస్ ఫ్యాక్ ను తానే సొంతంగా ఇంట్లో తయారు చేసుకుంటుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో, ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి పండు గుజ్జు లేదా నారింజ పండ్ల గుజ్జును కలిపి తన ఫేస్ కు రాసుకుని పది నిమిషాల తరువాత నీటితో కడిగేస్తుంది. ఆహారం విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటుంది. చర్మ సంరక్షణ కోసం జాన్వీ ఎక్కువగా పచ్చి కూరగాయలను, పండ్లను ఆహారంగా తీసుకుంటుంది. జంక్ ఫుడ్ జోలికి జాన్వీ అస్సలు వెళ్లదు.
జాన్వీ తన శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు మేకప్ ను అస్సలు ఉంచుకోదు. కృత్రిమ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగించదు. అలాగే చర్మ సంరక్షణకు నీటిని ఎక్కువగా తాగుతుంది. నీటిని తాగడం వల్ల చర్మం పొడి బారకుండా ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. ఇలా జాన్వీ తన చర్మ సంరక్షణ కోసం.. అందంగా కనిపించేందుకు.. అనేక రకాల సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ ఉంటుంది.