DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే డీజే టిల్లులో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఈ సినిమాలో నటించదంటూ ముందుగానే చెప్పేశారు.
ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలను అనుకున్నా.. అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఇంతకీ శ్రీలీల తప్పుకోవడానికి, అనుపమ ఫైనల్ కావడానికి కారణమేంటో తెలిసింది. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే మాస్ మహా రాజా రవితేజ సరసన ధమాకాలో, అనగనగా ఒక రాజు మూవీలలో నటిస్తోంది. మరోవైపు బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ మెరియనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డీజే టిల్లును నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే శ్రీలీలకు సంబంధించిన మరో 3 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.

అలాగే ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డీజే టిల్లు 2కు హీరోయిన్ గా ఎంపిక చేస్తే డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉందని శ్రీలీలనే తప్పుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల తప్పుకోవడంతో అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు. శ్రీలీల కంటే అనుపమకు యూత్ లో గట్టి ఫాలోయింగ్ ఉండటం, ఇటీవలనే కార్తీకేయ 2తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో అనుపమను ఫైనల్ చేశారు. మొత్తంగా డీజే టిల్లు 2 హీరోయిన్ గా కేరళ కుట్టిని ఫైనల్ చేసినట్టు మేకర్స్ కన్ఫమ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.