Naresh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. నరేష్ భార్య రమ్య.. కర్ణాటకలో మీడియాకు ఎక్కడంతో మొత్తం తంతు అంతా బయటకు వచ్చింది. నరేష్, పవిత్ర ఇద్దరూ తాము సహజీవనం చేస్తున్నామని ఒప్పుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే వారిపై రమ్య న్యాయ పోరాటం చేస్తానంటోంది. మరోవైపు రమ్యకు పలువురు మద్దతు తెలుపుతుండగా.. నరేష్‌కు కూడా కొందరు సపోర్ట్‌ను ఇస్తున్నారు. అయితే నరేష్, పవిత్రల వ్యవహారం ఏమో గానీ సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టిస్తున్న వారికి మంచి కంటెంట్ దొరికినట్లు అయింది. దీంతో వారు ఆ ఇద్దరిపై మీమ్స్ పెడుతూ నెటిజన్లకు వినోదాన్ని అందిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన ఏదైనా ఉంది.. అంటే అది నరేష్, పవిత్ర లోకేష్‌ల వ్యవహారం అనే చెప్పవచ్చు. ఈ ఇద్దరూ ఎంతో కాలం నుంచి సహజీవనం చేస్తున్నా.. రమ్య కారణంగా వీరిద్దరి విషయాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. అయితే దీన్నే చాలా మంది కంటెంట్‌గా చేసుకుని మీమ్స్ చేస్తున్నారు. తాజాగా ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీజే టిల్లులో ఒక ఫేమస్ సీన్ ఉంటుంది తెలుసు కదా.. ఇప్పుడేం చేద్దాం అంటే.. నిజంగా నన్ను ఈ ప్రశ్న కావాలనే అడుగుతున్నావు కదా రాధికా.. అనే డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని నరేష్, పవిత్రలకు అన్వయిస్తున్నారు.
ఇప్పటి వరకు నరేష్, పవిత్రల మధ్య ఉన్న బంధం రివీల్ కాలేదు. కానీ నరేష్ భార్య రమ్య కారణంగా ఆ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. దీంతో ఆ ఇద్దరూ నిజాన్ని అంగీకరించక తప్పడం లేదు. ఇక దీన్నే డీజే టిల్లులోని డైలాగ్‌కు ఆపాదిస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం నరేష్.. అంటే.. నువ్వు నిజంగా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావా పవిత్ర.. అని ఒక మీమ్ ను సృష్టించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా వీరి వ్యవహారం ఏమోగానీ ఇప్పుడు మీమ్స్ క్రియేటర్లకు కావల్సినంత కంటెంట్ దొరికినట్లు అయింది. దీంతో వీరిపై చాలా మీమ్స్ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…