Ramya Krishnan : అందాల భామ రమ్యకృష్ణకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో రమ్యకృష్ణ సినిమాలు వస్తున్నాయంటే చాలు కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. అప్పటి యూత్ లో అంత క్రేజ్ ఉండేది రమ్యకృష్ణకి. తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2003లో డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత రంగమార్తాండ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రమ్యకృష్ణ.
సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ గత కొంతకాలంగా రమ్యకృష్ణ, కృష్ణవంశీల మీద ఒక వార్త బాగా ప్రచారం అవుతోంది. ఈ దంపతులు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ వార్తని కృష్ణవంశీ ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా వార్తలను ప్రచారం అవడానికి గల కారణం వీరు గత కొంత కాలంగా దూరంగా ఉండటమే.

అయితే కృష్ణవంశీ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో విడిపోయారనే వార్తలు ప్రసారం కావడంపై క్లారిటీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఇటీవల లైగర్ ఈ చిత్రంలో నటించిందని అందరికీ తెలిసిన విషయమే. లైగర్ చిత్రంలో అద్భుతమైన నటన ఎవరిది అంటే అది ఒక రమ్యకృష్ణనే అని చెప్పవచ్చు. లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా రమ్యకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కృష్ణవంశీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా వివాహ బంధంపై చాలా పుకార్లు వస్తున్నాయి. కానీ వాటిలో అసలు నిజం లేదు.
నేను రమ్య విడిపోలేదు. మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. మొదట్లో ఇలాంటి వార్తలు చూసి ఇద్దరం బాధపడే వాళ్లం. నేను, రమ్యకృష్ణ వేరుగా ఉండటం నిజమే. నేను సినిమా షూటింగ్ పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. రమ్యకృష్ణ మా బాబుని చదివించుకుంటూ చెన్నైలో ఉంటుంది. కచ్చితంగా ఖాళీ సమయం దొరికినప్పుడు మేము కలుస్తాం. మా మధ్య విభేదాలు, విడాకులు అనే వార్తలు అవాస్తవం. ఇది కేవలం పుకార్లు మాత్రమే, దీనిలో నిజం లేదు.. అంటూ కృష్ణ వంశీ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.