Dishti For Children : మనుషులకు దిష్టి తగలడం అన్నది సహజం. చిన్నా పెద్దా ఎవరికైనా సరే అప్పుడప్పుడు దిష్టి తగులుతుంది. ఒక్కోసారి మన సొంత లేదా మన ఇంట్లో ఉండే వారి దిష్టే మనకు తగులుతుంది. మనల్ని మనం చూసి మురిసిపోయినా.. గొప్పగా ఫీలైనా.. అందంగా ఉన్నామని కామెంట్స్ చేసినా.. దిష్టి తగులుతుంది. తినేటప్పుడు అదే పనిగా చూసినా కూడా దిష్టి తగులుతుంది. అయితే చిన్నారులు చాలా ముద్దుగా ఉంటారు కనుక వారికి తరచూ దిష్టి తగులుతుంది. కానీ వారికి పెద్దలకు తీసినట్లు దిష్టి తీయకూడదు. అందుకు భిన్నమైన పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. ఇక చిన్నారులకు దిష్టి ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నారులకు కర్పూరంతో దిష్టి తీయాల్సి ఉంటుంది. సాధారణంగా పెద్దలకు అయితే ఉప్పు లేదా చీపురుతో దిష్టి తీస్తారు. కానీ చిన్నారులకు కర్పూరంతో దిష్టి తీయాలి. కర్పూరం బిళ్లలు 3 తీసుకుని ఒక పళ్లెంలో వేసి చిన్నారులకు దిష్టి తీయాలి. మూడు సార్లు తిప్పాక కర్పూరాన్ని ఎవరూ తొక్కని చోట పడేయాలి. ఇలా చేయడం వల్ల కర్పూరం కరిగిపోతుంది. కర్పూరం కరిగే కొద్దీ దిష్టి పోతుందని అర్థం. ఇలా చిన్నారులకు దిష్టి తీయాల్సి ఉంటుంది. ఇక చిన్నారులకు సులభంగా దిష్టి తగులుతుంది కనుక వారి కాళ్లకు, చేతులకు నల్లని దారాలను కట్టాలి. అలాగే తలపై, బుగ్గపై కాటుక చుక్కలు పెట్టాలి. అర చేతిలో, అరికాలిలోనూ కాటుక చుక్కలు పెట్టాలి.
చిన్నారులకు దిష్టి తగిలితే నలతగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఏమీ తినరు. ఇలాంటప్పుడు దిష్టి తగిలి ఉంటుందని భావించాలి. వెంటనే రాళ్ల ఉప్పుతో మూడు సార్లు దిష్టి తీయాలి. తరువాత ఆ ఉప్పును నీటిలో కలిపేయాలి. ఇక కొద్దిగా అన్నం వండి అందులో పసుపు, కుంకుమ కలిపి ముద్దలా చేసి కూడా దిష్టి తీయవచ్చు. అయితే దీన్ని ఎవరూ చూడని ప్రదేశంలో పడేయాలి. ఇలా చిన్నారులకు దిష్టి తీయవచ్చు. దీంతో వారిపై చెడు చూపు పడకుండా ఉంటుంది. వారు ఆరోగ్యంగా ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…