Disha Patani : లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటాని గురించి అందరికీ తెలిసిందే. లోఫర్ సినిమాతోనే తెలుగు తెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ విధంగా పలు బాలీ వుడ్ సినిమాలతో బిజీగా ఉన్న దిశా పటాని ఫిట్ నెస్ పై పూర్తి దృష్టి పెడుతుందనే విషయం మనకు తెలిసిందే. జీరో సైజ్ బాడీ కోసం ఈ ముద్దుగుమ్మ గంటల తరబడి జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కంట బీచ్ కనక పడితే బికినీలో వాలిపోతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటుంది.

ఇలా నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో అందరికీ పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియా ఖాతా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, వర్క్ అవుట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో బ్యాక్ మొత్తం చూపిస్తూ ఈమె చేస్తున్న వర్కౌట్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో లోఫర్ సినిమా తర్వాత టాలీవుడ్ కి దూరమైన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సల్మాన్ ఖాన్ తో జంటగా రాధే అనే మూవీలో చేసింది. ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం దిశా మూడు హిందీ సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతోంది.