Director Geetha Krishna : తెలుగులో ఆరుకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఓ మోస్తరుగా అలరించిన తెలుగు సినీ దర్శకుడు గీతాకృష్ణ. 2013వ సంవత్సరంలో ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించి డిజాస్టర్ కావడంతో సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న దర్శకుడు గీతాకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ ను, చంద్ర మోహన్ ను కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. కొన్ని పాత్రలకు కొందరు సూట్ కారని, ప్రేక్షకులు ఆ పాత్రల్లో వారిని చూడలేరని అన్నారు.
తమిళ రీమేక్ గా వచ్చిన మంచు పల్లకి సినిమాలో చిరంజీవి.. సుహాసిని చావు బతుకుల మధ్య ఉంటే ఏడుస్తాడు, ఆ సీన్ జనాలకు నచ్చలేదు. చిరంజీవి ఏడవడం జనాలకు నచ్చలేదు. అప్పటికి చిరు ఇంకా పెద్ద స్టార్ హీరో కాదు అయినా చిరంజీవి అంటే డాన్స్, ఫైట్ అనే భావనలో ఉన్న ప్రేక్షకులకు అలా ఏడవడం నచ్చలేదు, సినిమా ఫ్లాప్ అయింది. అలాగే ఆపద్బాంధవుడు సినిమా కూడా చిరంజీవి ఇమేజ్ కి దూరంగా ఉండే సినిమా.. అందుకే పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

ఇక కమల్ హాసన్ తమిళ సినిమా రీమేక్ తెలుగులో చంద్ర మోహన్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాలో చంద్ర మోహన్ నటనను అనవసరంగా పొగుడుతున్నారని, కమల్ హాసన్ చేసిన దాంట్లో 10 శాతం కూడా నటించలేదంటూ ఘాటుగా స్పందించాడు. మన తెలుగు వాడు కాబట్టి మనం కమల్ ను దాటి నటించాడు అంటూ గొప్పలు చెప్పుకుంటాం అంటూ కామెంట్స్ చేశాడు గీతాకృష్ణ. దర్శకుడు గీతాకృష్ణ 1987వ సంవత్సరంలో సంకీర్తన అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఆరు సినిమాలకి దర్శకత్వం వహించినప్పటికీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ అవ్వలేదు.