Dimple Hayathi : రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హయతి అదిరిపోయేలా గ్లామర్ షో చేసింది. ఇటీవలే విడుదలైన ఫుల్ కిక్కు సాంగ్‌లో డింపుల్ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

తాను కొంచెం రంగు తక్కువగా ఉన్నానని చెప్పి తనను అవమానించారని డింపుల్ హయతి పేర్కొంది. తనకు టాలీవుడ్‌లో అంత సులభంగా ఏమీ అవకాశాలు రాలేదని, రంగు తక్కువగా ఉన్నాననే కారణంతో తనకు అవకాశాలు ఇవ్వలేదని తెలిపింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రతిభ ఉన్నవారినే ఆదరిస్తున్నారని, కనుక రంగుతో పనిలేదని ఈమె చెప్పుకొచ్చింది.
Dimple Hayathi : డ్యాన్స్‌తో అదరగొట్టిందని..
డింపుల్ సహజంగానే ప్రొఫెషనల్ డ్యాన్సర్. గద్దలకొండ గణేష్ చిత్రంలో సూపర్ హిట్టు ఐటమ్ సాంగ్‌లో అలరించింది. ఈ క్రమంలోనే ఖిలాడిలోనూ డ్యాన్స్‌తో అదరగొట్టిందని తెలుస్తోంది. అయితే ఆ ఐటమ్ సాంగ్ తరువాత తనకు అనేక అవకాశాలు అలాంటివే వచ్చాయని, కానీ హీరోయిన్‌గా తొలిసారి అవకాశం వచ్చిందని.. ఇది తనకు సరైన అవకాశమని తెలిపింది. మరి ఖిలాడి మూవీ ఈ అమ్మడికి హిట్‌ను అందిస్తుందా.. ఈమె కెరీర్ గ్రాఫ్‌ను పెంచుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.