Dimple Hayathi : డింపుత్ హయతి మంచి జోరు మీద ఉంది. ఆమె నటించిన ఖిలాడి మూవీ తాజాగా విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి టాక్‌నే సంపాదించింది. అలాగే ఈ అమ్మడి అందాల ప్రదర్శన సరేసరి. దీంతో ఆమెకు ఓ మూవీలో చాన్స్ వచ్చింది. గోపీచంద్ సరసన ఈ అమ్మడు నటించనుంది.

ఖిలాడి మూవీ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా.. ఈ మూవీలో డింపుల్ హయతి చేసిన అందాల ప్రదర్శన అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇలాంటి గ్లామర్ షో చేసే హీరోయిన్లకే ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. అందులో భాగంగానే డింపుల్ హయతికి ఈ ఆఫర్ వచ్చిందని అనుకోవచ్చు.
శ్రీనివాస్ అనే నిర్మాత నిర్మించనున్న గోపీచంద్ మూవీలో డింపుల్ హయతి నటిస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. ఏది ఏమైనా.. తన గ్లామర్ షోతో డింపుల్ హయతి ఓ మూవీ ఆఫర్‌ను కొట్టేసిందని చెప్పవచ్చు.