Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఆయన రెండో పెళ్లి 2020 డిసెంబర్ లో జరిగింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం అత్యంత సన్నిహితుల మధ్య ఆయన వివాహం చేసుకున్నారు. 49 ఏళ్ల వయసులో దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 11 గంటలకు ఆయన వివాహం చేసుకున్నారు. అయితే దిల్ రాజు రెండో పెళ్లి విషయం బయటకు రాగానే.. అటు ఇండస్ట్రీలోనూ బయటి జనంలో కూడా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరు ? ఎందుకు చేసుకున్నారు అనే చర్చలు ఎక్కువగా జరిగాయి. అయితే తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో.. అందుకు కారణాలు ఏమిటో.. దిల్ రాజు వివరించారు.
ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక ఉన్న అసలు కారణాన్ని ఓపెన్ గా చెప్పేశారు. తన భార్య అనిత చనిపోయాక తాను రెండేళ్ల పాటు ఒంటరిగా ఉన్నానని.. ఆమె మరణించాక కుమార్తె, అల్లుడు తన ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అయితే భార్య లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. తాను రోజంతా ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఇంటికి వస్తే భార్యను చూశాక మనసు ప్రశాంతంగా ఉంటుందని.. కానీ భార్య లేకపోవడంతో తనకు ఏదో లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఈ క్రమంలోనే తన కుమార్తె, స్నేహితులు, బంధువులు రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పారని.. దాంతో అమ్మాయి కోసం వెదికానని అన్నారు.
అయితే కొందరు అమ్మాయిలను పరిశీలించాక తనకు వైదా అయితే కరెక్ట్ అనిపించి ఆమెతో మాట్లాడానని.. అన్నీ చెప్పానని.. దీంతో ఆమె పెళ్లికి ఒప్పుకుందని అన్నారు. అందువల్లే తాము పెళ్లి చేసుకున్నామని తమకు కుమారుడు జన్మించాడని అన్నారు. ఇక తన మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలసి వచ్చేలా తన కొడుక్కి అన్వయ్ అని పేరు పెట్టామని వివరించారు. ప్రస్తుతం అంతా హ్యాపీగా ఉందన్నారు దిల్‌రాజు. అయితే దిల్ రాజు మాటలను బట్టి చూస్తే మొదటి భార్య అనిత మరణం వల్ల ఆయన తీవ్రంగా కుంగి పోయినట్లు అర్థమవుతుందని.. ఆ బాధ నుంచి బయట పడేందుకే ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని.. అర్థం అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా దిల్ రాజు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ మాత్రం వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…