Bananas For Diabetics : మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు అరటిపండు తినవచ్చా..? ప్రతిరోజు తింటే ఏమవుతుంది..?

Bananas For Diabetics : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ ఆహారం తీసుకోవాలన్న ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ఆహారం తీసుకున్న కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పులు ఏర్పడతాయో అనే భయం డయాబెటిస్ పేషెంట్లలలో ఉంటుంది. అందువలన ఏ ఆహార పదార్థాలు తినాలి అన్నకూడా భయంతో వెనక్కి తగ్గుతారు. ముఖ్యంగా పండ్లు తినవచ్చా లేదా అనే విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. అరటిపండ్లు తియ్యగా ఉంటాయి కనుక మధుమేహం ఉన్నవారు తినకూడదు అని ఒక అపోహ కూడా ఉంది.

డయాబెటిస్ పేషెంట్స్ కి ఆహారంలో రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దోహదం చేయని ఆహారాలు ఉండాలి. పండ్లలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా పండ్లు తినకూడదనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చాలా పండ్లలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. అలాంటి పండ్లులో అరటిపండు కూడా ఒకటి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దోహదం చేయవు. ఏ ఆహారమైనా పరిమితిని బట్టి తీసుకుంటే, అవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

Bananas For Diabetics

అరటిపండు అనేది సాధారణంగా అల్పాహారంలో భాగంగా తినే పండు. ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది మరియు పిండి పదార్థాలు మరియు చక్కెర రెండింటినీ కలిగి ఉంటుంది. దీని వలన అరటిపండు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచగలదని,  మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండు తినడం ఆరోగ్యకరమా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఒక పెద్ద అరటిపండులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి కారణమవుతాయి. మధ్య తరహా అరటిపండులో 14 గ్రాముల చక్కెర మరియు 6 గ్రాముల స్టార్చ్ ఉంటుంది. కానీ అరటిపండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అరటిపండులో ఫైబర్ అధికంగా ఉండటం వలన డయాబెటిస్ పేషెంట్లులో ఎక్కువగా ఏర్పడే మలబద్ధక సమస్య తగ్గుతుంది.

అరటిపండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ కలిగి ఉంటాయి మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ అభిప్రాయం ప్రకారం  అరటిపండులో చక్కెర మరియు పిండి పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండును తినవచ్చు, కానీ మితంగా తినవచ్చు అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను ఏ పరిమాణంలో తినాలి అంటే.. ఒక చిన్న అరటిపండు వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ అరటిపండును తినకూడదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM