Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉన్నాయా.. అయితే షుగ‌ర్ కావ‌చ్చు.. నిర్ల‌క్ష్యం చేస్తే ప్ర‌మాదం..

Diabetes Symptoms : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. కొన్ని గణాంకాల ప్రకారం, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. డయాబెటిస్ అనేది టైప్-1, టైప్-2 అని  రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. డయాబెటిస్ వ్యాధిని సరైన సమయంలో నియంత్రించకపోతే, దాని ప్రభావం శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దీని ప్రభావం కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కళ్లపై కూడా కనిపిస్తుంది.

ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే క‌చ్చితంగా జాగ్రత్త వహించాలి. డయాబెటిస్ వ్యాధి వచ్చింది అనటానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవి ఏంటంటే.. రోగి మరింత అలసిపోయినట్లు, ఎక్కువగా ఆకలి వేయటం, ఎక్కువ దాహంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఎక్కువ సార్లు మూత్రం విసర్జన చేయవలసి వస్తుంది. ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం వల్ల డీహైడ్రేషన్ కు లోనవుతారు. డయాబెటిస్ పేషెంట్ల‌ నోటి నుండి దుర్వాసన వస్తుంది. పురుషుల కంటే మహిళలకు మధుమేహం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

Diabetes Symptoms

మహిళలలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది ఒక సాధారణ వ్యాధి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం UTI అనేది బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే వ్యాధి. తరచుగా ఈ వ్యాధిలో స్త్రీలు కిడ్నీ, గర్భాశయం లేదా మూత్రాశయం మొదలైన వాటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కొన్నిసార్లు UTI కూడా మహిళల్లో మధుమేహానికి సంకేతంగా ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా చాలా మంది తమ నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తారు. నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు రావడం కూడా మధుమేహం లక్షణంగా చెప్పవచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా తగ్గడం కూడా మధుమేహం లక్షణమే. ఆడవారిలో బరువు తగ్గడం లేక పెరగడం వలన ఋతుక్రమంలో అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాకుండా చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఓవరీస్ లో నీటి బుడగలు ఏర్పడతాయి. అందువలన మహిళలకు నెలసరి అనేది కచ్చితమైన సమయానికి రాదు. ఈ లక్షణాలు కనిపిస్తే క‌చ్చితంగా వైద్యులను సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ ఉన్నవారు మంచి ఆహార నియమాలు పాటిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్టింగ్ లో 110, పోస్ట్ లంచ్ తరువాత 160 – 170 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

Share
Mounika

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM