Devullu Nithya : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు. అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తెలుగు తెరపై చిన్నప్పుడే దర్శనం ఇచ్చి, తమ బరువైన అందాలతో సందడి చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో దేవుళ్లు సినిమాతో అలరించిన చిన్నారి నిత్యా ఒకరు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000వ సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవుళ్ళు. ఈ సినిమాలో.. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిన ఆడే చందమామలం.. అంటూ పాట పాడుతూ అమ్మానాన్న ప్రేమకోసం పరితపించే చిన్నారులుగా బేబీ నిత్య, మాస్టర్ నందన్ అదరగొట్టారు.

దేవుళ్ళు సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా.. పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఇందులో నటించిన చిన్నారి నిత్య హీరోయిన్ గా మారింది. ఆమె ఓ పిట్టకథ అనే సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటించింది. దాదాపు ఇరవై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది నిత్య. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ చిత్రాలలో నటించినందుకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును అందుకుంది.
ఇప్పుడు నిత్యని చూస్తే అస్సలు గుర్తు పట్టలేని విధంగా ఉంది. దేవుళ్లు సినిమాలో నటించింది ఈవిడేనా అనేలా ఉంది. నిత్య ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో స్టన్నింగ్ లుక్స్‌లో మెరుస్తోంది. ఇందులో నిత్య క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఈ అమ్మడికి ఏదో కొరత. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిర్మాతల దృష్టిని ఆకర్షించలేకపోతోంది. రానున్న రోజులలో అయినా ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయా.. అన్నది చూడాలి.