Devi Vs Vishwak Sen : విశ్వ‌క్ సేన్ వ‌ర్సెస్ దేవి.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప‌రువు పోగొట్టుకుంది ఎవ‌రు..?

Devi Vs Vishwak Sen : టీవీ చాన‌ల్స్ అంటేనే స‌హ‌జంగానే రేటింగ్స్ పెంచుకునేందుకు ఏమైనా చేస్తుంటాయి. ఒక సాధార‌ణ వార్త‌ను కూడా సెన్సేష‌న‌ల్ చేసి రేటింగ్స్ రాబ‌ట్ట‌గ‌ల‌వు. ఒక సెల‌బ్రిటీతో వివాదం పెట్టుకుని న‌డిరోడ్డుకు ఈడ్చ‌గ‌ల‌వు. వారు త‌ల‌చుకుంటే ఏమైనా చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు అలాంటి చాన‌ల్స్ చేసే త‌ప్పులు వారి ప‌రువు మొత్తం పోయేలా చేస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా చోటు చేసుకున్ని విశ్వ‌క్ సేన్ వ‌ర్సెస్ దేవి వివాదం.. స‌ద‌రు చాన‌ల్ ప‌రువు మొత్తం పోయేలా చేసింద‌ని అంద‌రూ బ‌హిరంగంగానే చ‌ర్చించుకుంటున్నారు.

Devi Vs Vishwak Sen

విశ్వ‌క్‌సేన్ ఒక అప్‌క‌మింగ్ హీరో. న్యూస్ చానల్స్ రేటింగ్స్ కోసం ఎలాగైతే ఏం చేసేందుకు అయినా వెనుకాడ‌వో.. అలాగే ఒక ప్రాంక్ వీడియో చేసి ఎలాగైనా స‌రే త‌న సినిమాకు ప‌బ్లిసిటీ తేవాల‌ని విశ్వ‌క్ అనుకున్నాడు. కానీ ఒక లాయ‌ర్‌కు అది న‌చ్చ‌లేదు. హ్యూమ‌న్ రైట్స్ దాకా వెళ్లాడు. అక్క‌డివ‌ర‌కు ఓకే. కానీ ఇందులో ఆ చాన‌ల్ వారు త‌ల‌దూర్చి రేటింగ్స్ పెంచుకోవ‌డం ఒక డిబేట్ పెట్టారు. అది కూడా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ హీరోను చిన్న చూపు చూస్తూ ఆ యాంక‌ర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడిందో అక్క‌డే బెడిసికొట్టింది. వాస్త‌వానికి ఆమె అలా మాట్లాడ‌కుండా ఆ హీరో చిక్కుకున్న వివాదంపైనే ఫోక‌స్ పెట్టి ఉంటే బాగుండేది. కానీ ఆమె వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసింది. అలా చేస్తే హీరోయే కాదు.. ఎవ‌రైనా స‌రే ఊరుకోరు. అక్క‌డే నెటిజ‌న్ల‌కు సైతం న‌చ్చ‌లేదు. హీరో చేసిన ప‌ని న‌చ్చ‌క‌పోతే దాన్ని విమ‌ర్శించాలి కానీ ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న త‌లెత్తింది. వెర‌సి ఆ చాన‌ల్ వారు చేసిన ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఇది విశ్వ‌క్‌కు ప్ల‌స్ అయింది.

అయితే మొత్తం వ్య‌వ‌హారంలో అంద‌రి ప‌రువు పోయింది. కానీ ఆ చాన‌ల్ ప‌రువే ఇంకాస్త ఎక్కువ పోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆ చాన‌ల్ పేరు చెబితేనే నెటిజ‌న్లు ఒంటికాలు మీద లేచే స్థాయికి వారే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ యాంక‌ర్ ప‌రిస్థితి కూడా దాదాపుగా ఇలాగే మారింది. ఆమె మ‌ళ్లీ య‌థాప్ర‌కారం ఆ చాన‌ల్‌లో ప్రోగ్రామ్‌లు చేస్తోంది. కానీ ఇంత‌కు ముందు చూసిన‌ట్లు చూడ‌డం లేదు. ఆమెను విమ‌ర్శించ‌డ‌మే నెటిజన్లు ప‌నిగా పెట్టుకున్నారు. ఆమె అలా చేయ‌డం ఏమోగానీ.. అలా ఆమెపై మాట్లాడేందుకు ఆమెనే అలుసు ఇచ్చిన‌ట్లు అయింది. అయితే రానున్న రోజుల్లో ఆయ‌నా ఆమె వీక్ష‌కుల సానుభూతి పొందుతుందేమో చూడాలి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM