Whatsapp : వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తోపాటు వాటి మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ సేవలు 2 గంటలుగా నిలిచిపోయాయి. ఉన్న పళంగా ఈ మూడు నెట్‌వర్క్ లకు చెందిన సేవలు నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. కొందరు తమ ఇంటర్నెట్ పనిచేయకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమోనని భావిస్తుండగా.. కొందరికి మాత్రం ఫేస్‌బుక్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు అర్థమవుతోంది.
అయితే సాధారణంగా ఇంతటి పెద్ద నెట్‌వర్క్ లకు చెందిన సైట్లు 1 లేదా 2 నిమిషాల పాటు డౌన్ అవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 2 గంటల నుంచి ఈ మూడు నెట్‌వర్క్ లు పనిచేయడం లేదు. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్‌పై సైబర్ దాడి జరిగిందని, అందుకనే ఈ మూడు నెట్‌వర్క్‌లకు చెందిన సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
అయితే వాట్సాప్‌పై చైనాకు చెందిన హ్యాకర్లు దాడి చేసి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. మరో వైపు దీనిపై ఫేస్‌బుక్ కచ్చితంగా చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వచ్చిందని, సరిచేస్తున్నామని మాత్రం ఫేస్‌బుక్ చెబుతోంది. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…