Liger : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం.. లైగర్. ఈ మూవీ గురించి చిత్ర బృందం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను విడుదల చేస్తూ ఉంది. అయితే ఇందులో అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటిస్తున్న విషయం విదితమే. ఆయనను అసలు ఎలా కలిశారు, ఎలా ఒప్పించారు ? అన్న చర్చే ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా ఆయనకు ఇస్తున్న పారితోషికం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీకి గాను విజయ్ దేవరకొండ పూర్తిగా అంకితం అయ్యాడు. ఈ మూవీ విడుదల అయ్యే వరకు మరో మూవీని అతను చేయబోవడం లేదని తెలుస్తోంది. దీంతో అతను రెండేళ్ల కాలానికి ఏకంగా రూ.20 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మైక్ టైసన్‌కు విజయ్ కన్నా ఎక్కువగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంటే.. ఆయనకు విజయ్ కన్నా రెండింతల ఎక్కువ మొత్తం అనుకున్నా.. రూ.40 కోట్లు అవుతాయి.
అయితే మైక్ టైసన్‌కు రూ.40 కోట్ల మేర పారితోషికం ఇస్తున్నారా, లేదా.. అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆయనకు ఒక వేళ అంత మొత్తం ఇచ్చినా.. పోస్టర్లలో టైసన్ బొమ్మ ఉంటే బిజినెస్ బాగా జరుగుతుందని నిర్మాతలు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు ఇచ్చే దానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయనకు భారీ మొత్తం ముట్టజెప్పి మరీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే లైగర్ మూవీ ఏ మేర ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది ? అన్నది తెలియాలంటే.. చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…