Samantha : గత కొద్ది రోజులుగా సమంత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె కూకట్ పల్లి కోర్టులో పలు యూట్యూబ్ ఛానల్స్‌పై పరువు నష్టం దావా పిటిషన్ వేసింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరపగా ఈ విచారణలో భాగంగా సమంతకు కోర్టు నుంచి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత తనని అప్రతిష్టపాలు చేస్తున్నారని సమంత పరువు నష్టం దావా పిటిషన్ వేసింది.
అయితే గురువారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టగా.. కోర్టు తీర్పును శుక్రవారంకు వాయిదా వేసింది. గురువారం కోర్టు సమయం ముగియడంతో తీర్పును వెల్లడించక పోవడమే కాకుండా సమంతా పిటిషన్ పై చురకలు అంటించింది. పరువు నష్టం దావా కింద పిటిషన్ వేసిన తర్వాత తను క్షమాపణ కోరాలి కానీ ఇలా డబ్బులను డిమాండ్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది.
ఇలా సమంత పిటిషన్ ను అత్యవసరంగా విచారించడానికి కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అయితే సమంత నటిగా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఆమె పిటిషన్ ను ఎమర్జెన్సీ కింద విచారించాలని సమంత తరపున న్యాయవాది బాలాజీ కోర్టుకు విన్నవించారు.
ఆయన వాదనను విన్న తర్వాత కూకట్ పల్లి న్యాయమూర్తి కోర్టుకు అందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భావన ఇక్కడ ఉండదని అన్నారు. సమంత కేసును అత్యవసర కేసుగా భావించి త్వరగా విచారించమని కోరడం కరెక్ట్ కాదని, అందరూ చట్టం ముందు సమానమేనని, ఇతర పరువు నష్టం కేసుల్లాగే ఈ కేసును కూడా విచారిస్తామని, మొత్తం ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతామని.. న్యాయస్థానం వెల్లడించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…