Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఉంటూ అందరి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విపత్తు సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాలకు ఎంతో సహాయం చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు రామ్ చరణ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ఆఫీసులో రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు.
ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్ లో ఉన్న సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము త్వరగా రెస్పాండ్ అవుతాము. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ ని డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాము.. అని రామ్ చరణ్ తెలిపారు.
మేము చేసే సేవా కార్యక్రమాలకి ఎవరన్నా వాలంటీర్లుగా రావాలన్నా ఈ వెబ్ సైట్ లో అప్లై చేయొచ్చు.. అని తెలిపారు. 20 ఏళ్లుగా ఈ ట్రస్ట్ తరపున సేవ చేస్తున్నాము. ఇక ముందు కూడా చేస్తూ ఉంటాము.. అని తెలిపారు. మరోవైపు చిరంజీవి పర్సనల్ వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో చిరంజీవి ఇప్పటిదాకా నటించిన సినిమాల వివరాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, చిరంజీవి సినిమాల్లోని పాటలు, చిరంజీవి ఫోటోలు, అన్నీ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…