Chiranjeevi : జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అందించిన మరో కథ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో హీరోయిన్ గా నటించారు. అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ల భరణి, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
హైదరాబాద్ లో ఈ శనివారం రాత్రి జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ఈ సినిమా రిలీజ్ రోజే నా తమ్ముడు బర్త్‌డే.. ముందుగా మీ అందరి సమక్షంలో నా తమ్ముడికి విషెస్ తెలియజేస్తున్నాను.. గాడ్ బ్లెస్ యూ పవన్ అంటూ విషెస్ తెలియజేశారు. పవర్ స్టార్ కి మెగాస్టార్ అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్‌డే విషెస్ తెలపడంతో వేడుకలలో పాల్గొన్న అభిమానుల కేకలు, ఈలలతో హోరెత్తిపోయింది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. దర్శకులు, నిర్మాతలు కథని సెలెక్ట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతో ఉంది. అందరితో చర్చించి ఈ కథ బాగుంది అన్న తర్వాత సినిమా చేయడానికి సిద్ధం అవ్వండి అని ఈవెంట్ లో చిరంజీవి ప్రస్తావించారు. కరోనా కష్ట కాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి తగ్గించారు. ప్రేక్షకులు సినిమా థియేటర్ లోకి రావాలి అంటే కంటెంట్ బలంగా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించగలదు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.